Home  »  TV News  »  Brahmamudi : రాజుతో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఇందు!

Updated : Aug 4, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1101  లో..... ఇందు, రాజుల చేత సత్యనారాయణ వ్రతం చేయించాలని అపర్ణ సుభాష్ గుళ్లో ఏర్పాట్లు చేస్తారు. వీళ్లేంటి ఇంకా రావడం లేదని అపర్ణ టెన్షన్ పడుతుంది. మరొకవైపు అసలు వీళ్ళు ఏ గుడికి వెళ్లి ఉంటారని భ్రమరాంబ, శేషు అనుకుంటారు. ఒక్క నిమిషం అల్లుడికి ఫోన్ చేసి కనుక్కుంటానని రాజుకి శేషు ఫోన్ చేసి మాట్లాడతాడు. రాజు ఎక్కడున్నావని అడుగుతాడు. గుళ్లో మావయ్య అని రాజు చెప్పగానే పూజ చేపిస్తానని ఇందు వాళ్ళు వెళ్లారు కదా అని శేషు అనగానే వెళ్తాను మావయ్య అని రాజు అంటాడు. శివాలయం కదా దగ్గరే ఉంటుందని శేషు అనగానే లేదు వెంకటేశ్వర గుడి అని రాజు చెప్తాడు.

అయ్యో అనవసరంగా మావయ్యకి అడ్రెస్ చెప్పాను.. ఇప్పుడు వాళ్ళు వెళ్లినా వెళ్తారు త్వరగా వెళ్ళాలని రాజు అనుకుంటాడు. మరొకవైపు గుడికి ఇందు వెళ్తుంది. రాజు ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. కొంచెం వర్క్ ఉంది నానమ్మ అని ఇందు చెప్పగానే ఐశ్వర్య చెప్పినట్లు అసలు రాజు నీ భర్తేనా లేక అద్దె మొగూడా అని అపర్ణ అంటుంది. నా మీద ఒట్టేసి చెప్పు అసలు మీరు భార్యాభర్తలేనా అని అపర్ణ అనగానే కాదని జరిగింది మొత్తం ఇందు చెప్తుంది. అసలు పెళ్లి అంటే ఏమనుకుంటున్నావ్ అని ఇందు చెంపచెల్లుమనిపిస్తుంది అపర్ణ. తాళి మెడలో వేసుకొని వచ్చావ్.. అసలు నీ జీవితం ఏమవుతుందోనని ఆలోచించావా.. పరాయి వాడు నీ భర్త అని చెప్పుకుంటున్నావని అపర్ణ అనగానే లేదు తను దుగ్గిరాల వారసుడు నీ కూతురు కొడుకు అని చలపతి చెప్పిన విషయం ఇందు చెప్పగానే అపర్ణ, శుభాష్ షాక్ అవుతారు.

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయం బావకి తెలియదు.. ఇప్పుడే చెప్పొద్దూ.. అమ్మ డైరీలో కొన్ని రాసుకుంది. అందులో అన్నీ నెరవేర్చాలి మా అమ్మ వాళ్ళు అక్కాచెల్లెల్లు కలిసి ఉన్నట్లు మేం కూడా ఉండాలని డైరీలో రాసుకుంది. ఐశ్వర్యని రేఖ ఆంటీ గుప్పిట్లో నుంచి బయటపడెయ్యాలని ఇందు చెప్తుంది. ఈ విషయం తెలియనట్లే ఉండమని ఇందు అంటుంది. అప్పుడే రాజు వస్తుంటాడు. నానమ్మ నువ్వు ఎమోషనల్ అవ్వకుండా ఉండమని ఇందు చెప్తుంది. మరొకవైపు భ్రమరాంబ శేషు దారిలోనే ఉంటారు. తరువాయి భాగంలో రాజుతో ఇందు మాట్లాడకుండా ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.